ఎక్కిళ్ళు తగ్గడానికి

SMTV Desk 2018-12-12 13:29:14  hiccups, How to stop hiccups

ఎక్కిళ్ళు రావడానికి వాతం చేసే ఆహారం పదార్ధాలు గానీ ,వేడి చేసే పదార్ధాలు గానీ ,అతిపుల్లని పదార్థాలుగానీ ,అరగని ఆహారం గానీ ఎక్కువగా తీసుకోవడం కారణం. పచ్చళ్ళు ,కారాలు ,మషాలాలు, అతిగా తినేవారికి ఎక్కిళ్ళు ఆగకుండా వస్తాయి. కొందరికి రోజుల తరబడీ నిలవడి పోతాయి కూడా .

లవంగాన్ని బుగ్గన పెట్టుకొని చప్పరించండి .ఎక్కిళ్ళు ఆగుతాయి .


ఏలకులు లోపలి గింజలు . పటికబెల్లం కలిపి నూరి ఓ చెంచా పొడిని పాలలో కలుపుకొని తాగండి లేదా నేరుగా తినేయండి . ఎక్కిళ్ళు తగ్గుతాయి.

అతి మధురం పొడి "యష్టిచూర్ణం" పేరుతో బజార్లో దొరుకుతుంది . ఈ యష్టిచూర్ణం 1/2చెంచా పొడిలో తేనె కలుపుకొని తింటే ఎక్కిళ్ళు ఆగుతాయి . యష్టిచూర్ణం అంతకన్నా ఎక్కువగా తింటెయ్ వాంతులవుతాయి .

ఎక్కిళ్ళు అవుతున్నప్పుడు వాంతి అయితే , నిజానికి చాల రెలైఫంగా ఉంటుంది .చూసుకొని వాడుకోండి .

పిప్పళ్లను నేతిలో వేయించి , తగినంత పంచదార వేసి మెత్తగా దంచి 1/2చెంచా పొడిని నోట్లో వేసుకొని పాలుగానీ ,పులవని మజ్జిగగాని తాగితే ఎక్కిళ్ళు ఆగుతాయి

పేరు నెయ్యిలో పంచదార వేసుకొని తినడం ,గోరు వెచ్చని పాలలోపంచదార వేసుకొని తాగడం .వీటి వలన కూడా ఎక్కిళ్ళు ఆగుతాయి.

వొక్కోసారి ఐస్ వేయకుండా మంచి చెరుకు గడను పిండిన చెరుకు రసం ఎక్కిళ్లు తగ్గిస్తుంది

వెలగ పండు గుజ్జులో పిప్పళ్ల పొడిని కలుపుకొని తింటే ఎక్కిళ్ళు ఆగుతాయి

పచ్చళ్ళు పెట్టుకునే ఉసిరికాయను ఆమలకి అంటారు. ఈ ఆమలకి కాయలు తాజాగా దొరికితే,దంచి రసంతీసి ,ఆ రసంలో పిప్పళ్లు పొడిని నేతిలో వేయించి కలిపి తాగితే ఎక్కిళ్ళు ఆగుతాయి .
ఎండు ఖర్జురాలు ,పిప్పళ్లు ,ఎండు ద్రాక్ష పంచదార ఈ నాలుగిటిని సమానంగా తీసుకొని అన్నిటిని కలిపి నూరి 1చెంచా పొడిలో తేనె కలిపి తీసుకుంటే ఎక్కిళ్ళు ఆగుతాయి .ఆయాసం తగ్గిపోతుంది .