తెలంగాణ ఎన్నికలపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్.!

SMTV Desk 2018-12-12 11:24:07  Ram Gopal Varma, KTR, KCR, Chandrababu, Rajanikanth, Maheshbabu

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణ ఎన్నికలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందించారు. కేటీఆర్ మీ నాన్న కెసిఆర్ అందరికంటే గొప్పవాడు, చాల సులువుగా గెలిచారు అని అన్నారు. ఆయన ట్విట్టర్ లో ఓ కేటీఆర్ మీ తండ్రి కెసిఆర్ 2.0 కాదు, కానీ ఆయన రజనీకాంత్ కంటే 20.0 ఎక్కువ, మహేష్ బాబు కంటే 200.0 ఎక్కువ, చంద్రబాబు కంటే 2000.0 ఎక్కువ అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కి మహేష్ బాబు ఆగడు సినిమా ఫన్నీ స్పూఫ్ ఫైట్ వొకదాన్ని జోడించి ట్వీట్ చేసారు.