ప్రాణం నిలబెట్టిన అత్యవసర కాల్ 100

SMTV Desk 2017-05-31 13:42:04  emargencey , dial 100, hyderabad police, ou police

హైదరాబాద్, మే 31 : పోలీసులకు సంబంధించిన అత్యవసర నెంబర్ 100 ఓ ప్రాణాన్ని నిలబెట్టింది. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటి ప్రాంతంలో జరిగిన వ్యక్తి కిడ్నాప్ కు సంబంధించిన సమాచారాన్ని అత్యవసర నెంబర్ 100 ద్వారా వెల్లడించడంతో ప్రాణాన్ని నిలబెట్టేందుకు దొహదం చేసింది. వివరాల్లోకి వెళ్తే ఉస్మానియా యూనివర్శిటి ప్రాంతంలో వాకింగ్ చేస్తున్న కమలాకర్ ను భార్య తరపు బావమరిది నాగరాజు మరికొందరు కట్టెలు రాళ్ళతో చితక బాది కారులో కిడ్నాప్ చేశారు. అయితే ఆ ఘటనను చూసిన వ్యక్తి వెంటనే పోలీసులకు 100 అత్యవసర నెంబర్ కు డయాల్ చేసి సమాచారం అందించారు. దాంతో అప్రమత్తమైన ఉస్మానియా యూనివర్శిటి పోలిసులు సిసి కేమరా పుటేజిని, ఇతర సమాచారం ఆధారంగా కారు సమాచారం, ఎక్కడికి తీసుకెళ్ళారు అనే వివరాలతో బయలుదేరి వెళ్ళారు. అక్కడ చెట్టుకు కట్టి పడేసి హత్య చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అక్కడకు చేరుకొని వారి బారి నుండి ఆయనను విడిపించి హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు. అసలు విషయానికోస్తే బాధితుడు కమలాకర్ ,కరీం నగర్ కు చెందిన ఉమాదేవిని వివాహాం చేసుకోని విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నాడు. ఆ క్రమంలో ఆగ్రహించిన భార్యతరపు వారు హత్యకు చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.