నిర్మాతగా మారిన సోనూసూద్

SMTV Desk 2018-12-11 15:58:26  soonusood,pv sindhu

హైదరాబాద్ ,డిసెంబర్ 11 : బాలీవుడ్ లో బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ రూపొందుతోంది. బయోపిక్ లకి అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ తరహా సినిమాలు అక్కడ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగు దశలో ఉన్న ఈ సినిమా లో శ్రద్ధా కపూర్ ప్రధానమైన పాత్రను పోషిస్తోంది .

ఇక మరో వైపున బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బయోపిక్ ను నిర్మించడానికి సోనూసూద్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. తెలుగు ,తమిళ, హిందీ భాషల్లో సోనూసూద్ కి మంచి గుర్తింపు వుంది. . పీవీ సింధు బాల్యం నుంచి వొలంపిక్ మెడల్ సాధించేవరకూ ఈ కథ కొనసాగుతుంది. ఈ సినిమాలో పీవీ సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రను సోనూ సూద్ పోషిస్తుండగా , ప్రధానపాత్రను పోషించే నటి కోసం అన్వేషిస్తున్నారు.