బేబీ పై క్రైస్తవ సంఘాల కోపం

SMTV Desk 2018-12-11 13:29:09  singer baby, christians, christianity

హైదరాబాద్ , డిసెంబర్ 11 :
ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన సహజ గాయని బేబీ పై క్రైస్తవ సంఘాలు కోపంగా ఉన్నారు . తను మొన్నటి వరకూ చర్చిలో వాక్యాలు వల్లెవేసి వొక్కసారిగా జీవనశైలిని మార్చి బొట్టు ధరించడం వాళ్ళ మతానికి విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు . అంతే కాకుండా బేబీ తనకు సహాయం చేసిన వాళ్ళని దేవుళ్లుగా సంబోధిస్తుంది , " వొక మనిషిని " దేవుడు అనడం బైబిల్ వాక్యాలకు విరుద్ధంగా ఉందని వారి అభ్యన్తరం వ్యక్తం చేస్తున్నారు .

అయితే వారు వొక్క విషయం గమనించాలి ఆమెకు ఇంత గుర్తింపు రావడానికి కారణం " ఏ . ఆర్ . రెహ్మాన్ " ఆయన వొక ముస్లిం సోదరుడు , ఆమెకు అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ కోటి,రఘు కుంచె హిందువులు , వాటికి అడ్డం రాని మతం కేవలం బొట్టుకి అడ్డమొస్తోంది అని అనడం వారి చిత్తశుద్ధి కి ప్రశ్నగా ఉందని నీటిజెన్లు ప్రశ్నిస్తున్నారు .