హాస్టల్ లో 'పెట్టా' ఏంచేస్తున్నాడు

SMTV Desk 2018-12-11 12:19:45  rajinikanth,petta

చెన్నై ,డిసెంబర్ 11 :
సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ వయసు పెరుగుతున్నా జోరుగా సినిమాలు చేస్తున్నాడు. క‌బాలి, కాలా, రోబో 2.ఓ… ఇప్పుడు `పేటా`. దీని త‌ర‌వాత మురుగ‌దాస్ తో ఓ క‌థ ఓకే అయ్యిందని సమాచారం . 2019 లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ప్ర‌స్తుతం `పేటా` పై దృష్టి పెట్టాడు ర‌జ‌నీ. ఇందులో పాట‌లు కూడా విడుద‌లై… హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో ర‌జ‌నీ పాత్రేమిట‌న్న‌ది స‌స్పెన్స్‌గా మారి పలు ఊహాగానాలు వస్తున్నాయి వాటిలో ఎక్కువగా ర‌జ‌నీ డాన్‌గా క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఇందులో ర‌జ‌నీ వార్డెన్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌ అదీ లేడీస్ హాస్ట‌ల్ కీ .
సైన్యంలో ప‌నిచేసిన క‌థానాయ‌కుడు అక్క‌డ ప‌ద‌వీ విర‌మ‌ణ పొంది.. ఓ లేడీస్ హాస్ట‌ల్‌లో వార్డెన్‌గా చేర‌తాడ‌ని, అక్క‌డే ‘పేటా క‌థ అనేక మ‌లుపులు తిరుగుతుంద‌ని చెన్నై ఫిల్మ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. త్రిష క‌థానాయిక‌ గా చేస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వహించగా సిమ్రాన్‌, న‌వాజుద్దీన్ సిద్దికీ కీలక పాత్ర‌లు పోషిస్తున్నారు.