ఈ సారి కప్ సాధిస్తాం : రాహుల్

SMTV Desk 2017-07-26 10:27:35  pro, Kabaddi, telugu taitans, rahul choudary

హైదరాబాద్, జూలై 26 : ఈ సారి ఖచ్చితంగా విజయం సాధిస్తామని తెలుగు టైటాన్స్ ఆటగాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు సీజన్స్ లో తమ జట్టు రెండు సార్లు సెమీస్ చేరి గెలిచే అవకాశాలను మిస్ చేసుకుందని తెలుగు టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ చౌదరి మాట్లాడుతూ..... 'గత నాలుగు సీజన్స్ లో మా జట్టు రెండు సార్లు సెమీస్ చేరి టైటిల్ మిస్ చేసుకుందని తెలిపారు. ఈ సారి ఐదవ సీజన్ లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. లీగ్ దశలో మా జట్టు బాగానే ఆడుతుందని, కానీ కీలక సమయంలో మాత్రం జట్టు ఆశించిన స్థాయి ఫలితాలను రాబట్ట లేకపోతుంది. మొత్తం యువ ఆటగాళ్ళతో జట్టు పటిష్టంగా ఉందని తెలిపారు. ఈ సారి ఖచ్చితంగా విజయం సాధిస్తాం' అని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. మొదటి మ్యాచ్ తమిళ్ తలైవాస్ తో ఈ నెల 28 న తలపడనుంది.