నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి చుక్కెదురు.!

SMTV Desk 2018-12-11 11:55:44  TRS, BJP, Congress,Elections

హైదరాబాద్, డిసెంబర్ 11: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ రెండు రాష్ట్రాల్లో దూసుకెళుతోంది. రాజస్థాన్‌లో 199 స్థానాలకు గాను 100 స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. భాజపా 74 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఛత్తీస్‌గఢ్‌ 90 స్థానాల్లో 64 స్థానాల్లో కాంగ్రెస్‌, 18 స్థానాల్లో భాజపా ఆధిక్యంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 114 స్థానాల్లో భాజపా, 108 స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక్కడ రెండు పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంది. మిజోరంలో 40 స్థానాలకు గాను మిజో నేషనల్‌ ఫ్రంట్‌ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార కాంగ్రెస్‌ 8 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది.

తెలంగాణాలో తెరాస 90 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమి 20 స్థానాల్లో, బీజేపీ వొక స్థానంలో ఆధిక్యంలో ఉంది. వొక్క మధ్యప్రదేశ్ లో తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి చుక్కెదురైంది.