బన్నీ కొత్త సినిమా ముచ్చట

SMTV Desk 2018-12-11 11:19:49  bunny,allu arjun,trivikram,julayi

హైదరాబాద్,డిసెంబర్ 11 :
త్రివిక్రమ్ ... బన్నీ కాంబినేషన్లో వొక సినిమా రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.అధికారకంగా అయితే ఇంతవరకూ ఎలాంటి ప్రకటన రాలేదు. దాంతో ఈ ప్రాజెక్టు ఉందో లేదో అనే సందేహం చాలామందికి ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు ఉందనేది తెలుస్తుంది.

బన్నీ కోసం త్రివిక్రమ్ వొక వైవిధ్యభరితమైన కథను తయారు చేసి రీసెంట్ గా స్క్రిప్ట్ వినిపించాడట. ఆ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు .. చేర్పులు బన్నీ చెప్పాడట. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తూ త్రివిక్రమ్ బిజీగా వున్నాడని వినికిడి . స్క్రిప్ట్ పూర్తి గా సిద్ధం కాగానే ఈ ప్రాజెక్టును ప్రకటించాలని ఆలోచనలో వున్నారని అంటున్నారు. గతంలో త్రివిక్రమ్ .. బన్నీ కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలలో జులాయి విజయం సాధించగా సన్ ఆఫ్ సత్యమూర్తి యావిరేజ్ గా నిలిచింది . అందువలన ఈ సారి ఈ కాంబినేషన్లో హిట్ పడటం ఖాయమనే ఆశ తో బన్నీ అభిమానులు వున్నారు.