తెలంగాణలో కారు జోరు…

SMTV Desk 2018-12-11 11:02:46  trs,telangana election,

హైదరాబాద్, డిసెంబర్ 11: తెరాస పార్టీకి తెలంగాణలో భారీ విజయం దిశగాదూసుకెళ్తోంది… ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి నుంచి భారీ మెజార్టీ దిశగా కారుజోరుని పెంచింది. ప్రధాన పోటీ తెరాస, కాంగ్రెస్ (మహాకూటమి) మధ్యనే ఉంది. ప్రస్తుతం అందుతున్నసమాచారం ప్రకారం తెరాస పార్టీ 90 స్థానాల్లో ముందంజలో ఉండగా.. మహా కూటమి 15 స్థానాల్లోముందంజలో ఉంది. మూడురౌండ్‌లు ముగిసే నాటికి తెరాస పార్టీ ముందంజలో ఉంది. సిద్ధిపేటలోహరీశ్ రావు 35,000 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ ఆధిక్యంలో ఉన్నారు.