మరికాసేపట్లో సిట్ ఎదుట చార్మి

SMTV Desk 2017-07-26 09:42:51  hyderaabad, drugs issue, chaarmi, sit officers

హైదరాబాద్, జూలై 26 : టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించిన సిట్ అధికారులు మరికాసేపట్లో సినీనటి చార్మిని విచారించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగనుంది. తాజాగా చార్మిని మహిళా అధికారుల సమక్షంలోనే విచారించాలని, అంతేకాకుండా ఆమె అనుమతి లేకుండా రక్త నమూనాలను సేకరించకూడదని హై కోర్ట్ సిట్ అధికారులను ఆదేశించింది.