'భారతీయుడు' కి సీక్వెల్ రాబోతుంది

SMTV Desk 2018-12-11 10:57:30  shankar,robo,rajini kanth,kamal hasan

చెన్నై , డిసెంబర్ 11 : తమిళనాట రజనీకాంత్ .. కమలహాసన్ అగ్ర కథానాయకులు. కమల్ కెరియర్లో గర్వించదగిన సినిమాగా శంకర్ దర్శకత్వం లో వచ్చిన భారతీయుడు ముందు వరుసలో ఉంటుడుంది . ఇక రోబో సినిమాతో రజనీ కెరియర్లో చెప్పుకోదగిన విజయాన్ని అందించిన శంకర్, ఆ సినిమాకి సీక్వెల్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అదే విధంగా భారతీయుడు సినిమాకి సీక్వెల్ ను సిద్ధం చేసే పనిలో వున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు జోరుగా జరుగుతున్నాయి.

ఈ సినిమాలో కమల్ సరసన కథానాయికగా కాజల్ ను ఎంపిక చేసుకున్న ఆయన, వొక ముఖ్యమైన పాత్ర కోసం వెన్నెల కిషోర్ ను ఎంపిక చేసుకున్నాడు. కీలకమైన పాత్రలకి దుల్కర్ సల్మాన్ ను , శింబును తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సంగీత దర్శకుడిగా అనిరుథ్ ని ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి ఈ నెల 14వ తేదీన వెళ్లనుంది. ఇది తాను చేసే చివరి చిత్రమని కమల్ చెప్పడంతో, సహజంగానే ఈ ప్రాజెక్టుపై అంతా ఆసక్తితో వున్నారు.