'యన్ . టి . ఆర్' సినిమా రెండవ పాట వాయిదా

SMTV Desk 2018-12-10 17:18:51  ntr,nbk,krish jagarlamudi,keervaani,siri vennele seetharama sastry

హైదరాబాద్ డిసెంబర్ 10 :
విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో , నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం " యన్ . టి . ఆర్ " . తెలుగు ప్రజల ఆరాధ్య దైవం , తెలుగుదేశం పార్టీ స్థాపకర్త నందమూరి తారక రామా రావు గారి జీవితం ఆధారం గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్నారు . ఈ మహత్తర చిత్రానికి బాలకృష్ణ తో సహా సాయి కొర్రపాటి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు .
ఇటీవల విడుదల చేసిన మొదటి పాట కి మంచి స్పందన వస్తుంది . తాజా గా రెండవ పాట ఈ రోజు సాయంత్రం 4:21 కి విడుదల చేస్జ్తున్నట్లు తెలిపారు. కారణమేమిటనేది తెలియదు గానీ, ఈ ఆలోచనని విరమించుకుని 2వ సాంగ్ విడుదల తేదీని ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల 31 నిమిషాలకి ఈ సాంగ్ ను విడుదల చేయనున్నట్టుగా మరో ప్రకటన చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ తో బాలకృష్ణ మంచి మార్కులు కొట్టేశారు. ఆయనతో 10 మందికి పైగా కథానాయికలు స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ సంచలన విజయానికి తెరతీయడం ఖాయమనేది సినీ అభిమానుల మాట.