'పడి పడి లేచె మనసు' పాటల ఎలా ఊన్నాయంటే

SMTV Desk 2018-12-10 16:55:14  sarwanand, sai pallavi, hanu raghavapudi, pradeep chukkapalli, sudhakar cherukuri

హైదరాబాద్ , డిసెంబర్ 10 : హనురాఘవపూడి దర్శకత్వం లో శర్వానంద్ , సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం " పడి పడి లేచె మనసు ". ఈ నెల 21 న విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు .ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర బ్యానర్ లో ప్రదీప్ చుక్కపల్లి , సుధాకర్ చెరుకూరి లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు .

ఈ చిత్ర ఆల్బమ్ గురించి మాట్లాడుకుంటే , ఆరు పాటలున్న ఈ ఆల్బం లో 4 పాటలు ప్రేమ నేపథ్యంలో సాగుతాయి మిగిలిన 2 పాటలు సందర్భానుసారం వచ్చే పాటలు మాదిరిగా మాస్ తరహా లో ఉన్నాయి . పదాలను మ్యూజిక్ డామినేట్ చేసే పాటలొస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి పాటలు రావడం అరుదని చెప్పాలి , రచయితల పదవిన్యాసానికి , విశాల్ చంద్రశేఖర్ సంగీతం తోడవ్వడం ఈ సినిమా మీద అంచనాలను పెరగడానికి పాటలు ఉపయోగపడతాయని అనుకోవచ్చు .