కెసిఆర్‌ ఆమరణ దీక్ష@ తొమ్మిదేళ్లు

SMTV Desk 2018-12-10 16:36:08  KCR, Amarana Deeksha, Udhyama award

హైదరాబాద్, డిసెంబర్ 10: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఉద్యమరత్న పురస్కార్ అవార్డుకు ఎంపిక చేసినట్లు శ్రీనివాస రామానుజ ఫౌండేషన్(ఎస్‌ఆర్‌ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ అమిరేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కమలాపూర్‌లో వొక పత్రికా ప్రకటన చేశారు. సిఎం కెసిఆర్‌ ఆమరణ దీక్షతో 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ప్రకటన చేసిన విషయాన్ని ఆయన తెలియ చేశారు. భారత దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిన సిఎం కెసిఆర్‌ నాటి ఆమరణ దీక్ష రాష్ట్ర సాధనలో కీలకంగా నిలిచి రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. దీంతో కేసీఆర్ తెలంగాణ జాతిపితగా నిలిచారన్నారు. కెసిఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టి నేటికి తొమ్మిదేళ్లు పూర్తి కావడంతో తెలంగాణ ఉద్యమ రత్న పురస్కార్ అవార్డుకు ఎంపిక చేసినట్లు అమిరేశ్ చెప్పారు.