ప్రభాస్ కంటే ముందే రానాకీ పెళ్లి కావడం ఖాయం

SMTV Desk 2018-12-10 12:19:34  rajamouli, bahubali,rana,prabhas,karan johar

హైదరాబాద్ , డిసెంబర్ 10 :
" బాహుబలి " మన తెలుగు చిత్ర సీమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన సినిమా . రాజమౌళి దర్శత్వంలో ప్రభాస్ హీరో,రాణా విలన్ గా నటించారు. కాగా అప్పట్లో బాహుబలి నార్త్ ప్రమోషన్ ని కరణ్ జోహార్ చూసుకున్నారు. ఆ చనువుతో ఆయన టీవీ షో "కాఫీ విత్ కరణ్ జోహార్" కీ వీరిని ఆహ్వానించగా పాల్గొని, అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు
వివరాల్లోకి వెళితే రాజమౌళి మాట్లాడుతూ " ప్రభాస్ పెళ్లెప్పుడు .. సినీ ఇండస్ట్రీలో ఇదో హాట్ టాపిక్ . కానీ ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదు . ఐతే .. ప్రభాస్ కంటే ముందే రానాకీ పెళ్లి కావడం ఖాయం, అందులో ఎలాంటి సందేహంలేదు " అని అన్నారు .

సాధారణంగా మీడియా ముందు మాట్లాడాలంటే ప్రభాస్ కు చాల సిగ్గు . అందుకే అతని ఇంటర్వ్యూలు పెద్దగా కనిపించవు . మొత్తానికి ఈ షో ద్వారా ప్రభాస్ నోరువిప్పాడు . తాను ప్రపంచంలోని అతి గొప్ప బద్దకిస్టుల్లో వొకడినని .. బద్దకం తన అతి పెద్ద వీక్ నెస్ అని ప్రభాస్ చెప్పాడు