యన్ . టి . ఆర్ చిత్రం రెండవ గీతం వచ్చేస్తుంది

SMTV Desk 2018-12-10 11:14:44  ntr,nbk,krish jagarlamudi,keervaani,siri vennele seetharama sastry

హైదరాబాద్ , డిసెంబర్ 10 : విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో , నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం " యన్ . టి . ఆర్ " . తెలుగు ప్రజల ఆరాధ్య దైవం , తెలుగుదేశం పార్టీ స్థాప కర్త నందమూరి తారక రామా రావు గారి జీవితం ఆధారం గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్నారు . ఈ మహత్తర చిత్రానికి బాలకృష్ణ తో సహా సాయి కొర్రపాటి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు .
ఇటీవల విడుదల చేసిన మొదటి పాట కి మంచి స్పందన వస్తుంది , తాజా గా రెండవ పాట విడుదల సమయాన్ని " లహరీ మ్యూజిక్ " ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు . సిరి వెన్నెల సీతారామ శాస్త్రి రచించన "రాజర్షి " అని సాగె ఈ గీతాన్ని ఈ రోజు సాయంత్రం 4:21 కి విడుదల చేస్జ్తున్నట్లు తెలిపారు .