జగన్ ఈ జన్మలో సీఎం అవ్వలేడు

SMTV Desk 2018-12-10 11:03:31  Jaganmohan Reddy, Adhinarayana Reddy

కడప, డిసెంబర్ 10: వైసీపీ అదినేత జగన్ ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేడని టీడీపీ నాయకుడు మంత్రి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. వైసీపీ నేతలు కడప జిల్లాలోని పల్లెల్లో తనను అడ్డుకుంటామని ప్రగల్భాలు పలుకుతున్నారనీ.. అసలు జగన్ ను పులివెందుల రాకుండా తామే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. జగన్ ను పులివెందులలో అడుగుపెట్టనివ్వం అని వ్యాఖ్యానించారు. కడప జిల్లాలోని ఎర్రగుంట్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలు పెట్టిన కేసులతో తనకు సంబంధమే లేదంటాడు. ‘తన తండ్రి ఫొటోను సాక్షి పేపర్ లో రోజూ వేసుకునే జగన్.. ఆ పేపర్ తనది కాదని అంటాడు. కానీ మాపై తన ఛానల్, పేపర్ లో నిత్యం తప్పుడు వార్తలు ప్రచురిస్తుంటారు. భారతి సిమెంట్ సంస్థతో తనకు సంబంధమే లేదంటాడు. పలు పట్టణాల్లో ఉన్న ఖరీదైన ఇళ్లు తనవి కాదని చెబుతాడు. చివరికి పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లపై కూడా నీచ రాజకీయం చేస్తున్నారు అని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు.