సరికొత్త అవతారంలో బొద్దు గుమ్మ

SMTV Desk 2018-12-10 10:45:22  hansika,kollywood,maha,gibram,jameel

చెన్నై , డిసెంబర్ 10 : బొద్దు గుమ్మ హన్సిక గురించి మనకి తెలిసిందే . ఈమె దేశముదురుతో చిన్న వయసులోనే సినిమాల్లో కి వచ్చి పలు విజయవంతమయిన చిత్రాలు నటించింది. అయితే ఈమె ఇప్పటి వరకు 49 చిత్రాలు నటించగా తాజా గా తన 50వ చిత్రం కోసం దొంగ బాబా అవతారం లో కనిపించనుంది . తమిళంలో ఆమె నటిస్తున్న చిత్రం మహా ,ఇందులో హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు సినిమా చిత్రీకరణ ప్రారంభమైన సందర్భంగా ఫస్ట్‌లుక్‌లను ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. లుక్‌లో హన్సిక దొంగ బాబా గెటప్‌లో దమ్ము కొడుతూ కనిపించింది . మరో పోస్టర్‌లో హన్సికను వివిధ గెటప్‌లలో చూపించారు. జమీల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా గిబ్రన్‌ సంగీతం అందిస్తున్నారు.


చెన్నై, మదురై, యూరప్‌లలో చిత్రీకరణ జరగనుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.2017లో వచ్చిన హన్సిక చివరిగా గౌతమ్‌నందా తెలుగు లో నటించిన చిత్రం. హన్సికకు తమిళంలోనే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. హన్సిక కెరీర్‌లో ఆమె అత్యధికంగా తమిళ చిత్రాల్లోనే నటించారు. ప్రస్తుతం హన్సిక చేతిలో మహా చిత్రంతో పాటు 100 , తుపాక్కి మునై చిత్రాలు కూడా ఉన్నాయి.