పవన్ కళ్యాణ్‌ నిలబడ్డ ప్లేస్‌లో ఓడగొడతా: శ్రీరెడ్డి

SMTV Desk 2018-12-09 17:54:51  Sri reddy, Pawan Kalyan

విజయవాడ , డిసెంబర్ 09 : తెలుగు చలన చిత్ర నటి శ్రీరెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు చాలెంజ్ విసిరింది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో చాలా రోజుల తరువాత లైవ్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి ఎన్నికల ముందు.. కారును తొక్కేయండి.. కూటమిని గెలిపించండి అంటూ కేసీఆర్, కేటీఆర్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.. అయితే వీరితో పాటు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌కి సవాల్ విసిరింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ఎలాంటి గతి పట్టిందో జనసేన పరిస్థితి కూడా అంతే అంటూ శాపనార్ధాలు పెట్టింది.

కాగా పవన్ కళ్యాణ్ వార్డు మెంబర్‌గా కూడా గెలవరంటూ అప్పట్లో సంచలనానికి తెర తీసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్‌ను, జనసైనికుల్ని రెచ్చిగొట్టే వ్యాఖ్యలు చేసింది. ఫేస్ బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ.. ‘ఎవర్నీ వదిలిపెట్టేది లేదు.. నా శపథం నెరవేరకుండా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటూ తీవ్ర ఆగ్రహం వెల్లగక్కింది. పవన్ కళ్యాణ్‌కి ఇంకా టైమ్ ఉంది. ఆయన నిలబడ్డ ప్లేస్‌లో ఓడగొడతా. ఆయన ఎక్కడ నామినేషన్ వేస్తే.. అదే ప్లేస్‌లో ఓడిస్తా అంటూ శపథం చేసింది.