తెలంగాణలో 73.2 శాతం పోలింగ్..

SMTV Desk 2018-12-09 17:53:45  Rajath Kumar, telangana, elections

హైదరాబాద్, డిసెంబర్ 09 :తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పష్టతనిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 73.2శాతంపోలింగ్‌ శాతం నమోదైందన్నారు. పోలింగ్ ముగిసిన దాదాపు 24 గంటల సమయం తర్వాత ఈ శాతాన్ని అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగియగా.. 69.1శాతానికిపైగా పోలింగ్‌ నమోదైనట్టురాష్ట్ర ఈసీ ప్రకటించారు. అయితే, రాత్రి10.30గంటల తర్వాతా కొన్ని కేంద్రాల్లోపోలింగ్‌ జరిగింది దీంతో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర ఈసీ కార్యాలయానికి నివేదికలుఅనుకున్న సమయానికి చేరలేదు. దీంతో పోలింగ్ శాతం మదింపుపై శనివారం రాత్రి వరకుకసరత్తు చేశారు. అత్యధిక యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.95 శాతం నమోదు కాగా…హైదరాబాద్లో 48.89 శాతంగా నమోదైందన్నారు.