కరుణానిధి విగ్రహావిష్కరణ, సోనియా, రాహుల్ కి ఆహ్వానం

SMTV Desk 2018-12-09 17:33:33  Karunanidhi, rahul, Sonia,

న్యూ ఢిల్లీ , డిసెంబర్ 09 : నేడు యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలతో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఆ పార్టీ ఎంపీ కనిమొళి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సోనియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 16న చెన్నైలో దివంగత కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం రాహుల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఇరు పార్టీల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. తమ సమావేశం మంచిగా కొనసాగిందని... అనేక విషయాలపై చర్చించామని రాహుల్ గాంధీ తెలిపారు.