సోనియాగాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

SMTV Desk 2018-12-09 17:32:23  Sonia Gandhi, MOdi,

న్యూ ఢిల్లీ , డిసెంబర్ 09 : నేడు డిసెంబర్ 09 ,యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆమె పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియాకు భారత ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సోనియాగాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ఆమె సుదీర్ఘకాలం జీవించాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. సోనియాకు పలువురు జాతీయ స్థాయి నేతలు కూడా శుభాకాంక్షలు తెలిపారు.