తిరుమలలో లడ్డు వ్యాపారం..?

SMTV Desk 2017-07-25 17:50:44  tirumala, laddu, police, arrest

తిరుమల, జూలై 25 : తిరుమలలో లడ్డులను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారం అందిన పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా గుట్టు రట్టయింది. మోసానికి పాల్పడుతున్న దళారులను తితిదే విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 14 మంది దళారులపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్‌ చేశారు. కాగా అధిక ధరలకు తిరుమల లడ్డులను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.