ఓట్ల లెక్కింపు కేంద్రాలకు భారీ భద్రత

SMTV Desk 2018-12-09 15:47:03  హైదరాబాద్ , డిసెంబర్ 09 : రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్ 7 శుక్రవారం జరిగిన ఎన్నికలు సాఫీగా ముగియడంతో ఇవిఎంలను ఆయా ప్రాంతాల లోని ఓట్ల లెక్కింపు కేంద్రాలకు భారీ భద్రత మధ్య తరలించారు. మొత్తం119 నియోజికవర్గా లకు జరిగిన ఎన్నికలు కొన్నిచోట్ల రాత్రి బాగా పొద్దుప

హైదరాబాద్ , డిసెంబర్ 09 : రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్ 7 శుక్రవారం జరిగిన ఎన్నికలు సాఫీగా ముగియడంతో ఇవిఎంలను ఆయా ప్రాంతాల లోని ఓట్ల లెక్కింపు కేంద్రాలకు భారీ భద్రత మధ్య తరలించారు. మొత్తం119 నియోజికవర్గా లకు జరిగిన ఎన్నికలు కొన్నిచోట్ల రాత్రి బాగా పొద్దుపోయే వరకు కొనసాగడంతో ఇ విఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలించడం ఆలస్య మయ్యింది. అన్ని నియోజికవర్గాలలోని ఇవిఎం లను రాష్ట్ర వ్యాప్తంగా 48 చోట్ల ఏర్పాటు చేసిన స్ట్రాం గ్‌ రూంలలో భద్రపరిచారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలోని ఆరు నియోజక వర్గాలలో కొన్ని గ్రామాలలో ఇవిఎంలు మొరా యించడం, సాంకేతిక సమస్యలు రావడంతో ఓటర్లు రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా క్యూ లైన్‌లో నిలుచుని తమ ఓటు హక్కును వినియోగిం చుకునేందుకు ఎదురు చూశారు. మొత్తం మీద రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు వీరంతా ఓటు హక్కు వినియోగించుకోవడంతో అనంతరం ఇక్కడి ఇవిఎంల ను సాయుధ పోలీసు భద్రత మధ్య పట్టణ ప్రాంతాలలోని ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలించారు.