భారత్ ఓటమికి కారణం చెప్పిన మిథాలి

SMTV Desk 2017-07-25 17:34:35  India, Mithali Raj, World Cup, England,

లండన్, జూలై 25 : ఇటీవల జరిగిన మహిళా ప్రపంచ కప్ లో భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ చివరి వరకు పోరాడి ఓడింది. టీమిండియా మహిళా జట్టు పై ప్రశంసల వర్షం కురుస్తుంది. వరల్డ్ కప్ లో భారత్ రన్నరప్ గా నిలిచింది. ఈ సందర్బంగా లండన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కెప్టెన్ మిథాలి రాజ్ మాట్లాడుతూ... జట్టులో ప్రతి ఒక్కరు ఒత్తిడికి లోనయ్యమని అదే మా ఓటమికి కారణమని అన్నారు. ఒక ఓవర్లో ఐదు, ఆరు పరుగులు చేయాల్సి వచ్చినప్పుడు ఉత్కంఠ పెరిగిందని చెప్పింది. వేద కృష్ణ మూర్తి క్యాచ్ వదిలేసినప్పుడు మేం విజయం సాధిస్తుందని అనుకున్నాం. కాని తమకు 10 పరుగులు అవసరమైనప్పుడు వికెట్లు కోల్పోవడంతో ఓటమి పాలయ్యమని మిథాలి రాజ్ భావోగ్వేదానికి లోనై చెప్పారు.