మెగాస్టార్ తో మరోసారి నయన్‌!

SMTV Desk 2018-12-09 11:43:05  Megastar, Nayantara, sye raa

హైదరాబాద్, డిసెంబర్ 09:స్వతంత్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవితం ఆధారంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేశారు. వచ్చే ఏడాది ఆగష్టు 15వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నారు.

కాగా, చిరంజీవి తరువాత క్లాసికల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ చురుగ్గా సాగుతున్నాయి. జనవరిలో సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడిగా నయనతారను తీసుకున్నట్టుగా సమాచారం. దక్షిణాది భాషల్లో నయనతారకు మంచి క్రేజ్ ఉన్నది. సైరాలో మెగాస్టార్ పక్కన నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే.