రాజధాని చుట్టూ భూమాఫియా నడిపిస్తున్న బాబు : జగన్

SMTV Desk 2018-12-08 18:47:21  Jaganmohan Reddy, Chandra Babu

శ్రీకాకుళం, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి చుట్టూ ఉన్న భూముల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు బినామీలే కొన్నారని ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో జరిపిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి లాంటి మహోన్నత నాయకుడి కుమారుడిగా జన్మించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు.

సీఎం చంద్రబాబు ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో భూమాఫియా రాజ్యం నడుస్తోందని..రాజధానిలో భూములన్నీ చంద్రబాబు బినామీలే కొంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పేదల ఇంటి రుణాలన్నీ మాఫీ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.