ఎవరి జాతకం ఏంటో 11న తేలనుంది ?

SMTV Desk 2018-12-08 17:34:50  KTR, TRS, Telangana Elections, Uttam Kumar Reddy

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణాలో తాజాగా ముగిసిన ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయా పార్టీలు గెలుపు మాది అంటే మాది అని ధీమా వ్యక్తపరుస్తున్నాయి. తెరాస ప్రభుత్వం గెలుపు మాదే అని ఢంకా మోగిస్తుంటే, ప్రజాకూటమి నాయకులు తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అంటున్నారు. ఈరోజు జరిగినా మీడియా సమావేశం లో కేటీఆర్ గారు తప్పకుండా తెరాస ప్రభుత్వం గెలుస్తుంది అని ధీమావ్యక్తం చేసారు. హైదరాబాద్ గోల్కొండ హోటల్ లో జరిగిన ప్రజాకూటమి నేతల సమావేశంలో ప్రజాకూటమి 70 నుంచి 80 స్థానాలు తప్పక గెలుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఇది ఇలా ఉంటే స్వతంత్ర అభ్యర్థులు మేమెంతక్కువ తిన్నామా గెలుపు మాదే అని ధీమాతో ఉన్నారు. ఎవరు గెలుస్తారో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందో ఇంకా మూడురోజుల్లో తెలియనుంది. ఎవరి జాతకం ఏంటో తెలియడానికి ఎంతో సమయం లేదు.