166 పరుగుల ఆధిక్యంలో టీమిండియా

SMTV Desk 2018-12-08 17:30:39  India. Australia, Pujara, KL rahul

ఆడిలైడ్ , డిసెంబర్ 08: మూడోరోజు బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లు రాణించడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ పట్టు సాధించింది. 191/7 తో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌.. భారత బౌలర్లు షమీ, బుమ్రాలు విజృంభించడంతో మరో 44 పరుగులు జోడించి 235 పరుగులకు ఆలౌటైంది. 15 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన భారత్‌..టాప్‌ ఆర్డర్‌ రాణించడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 151/3 నిలిచింది. మొత్తంగా భారత్‌ 166 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఉదయం వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. ఆట ముగిసే సమయానికి క్రీజులో పుజారా( 40), రహానే(1)లు ఉన్నారు.