అందరు మురళి మోహన్ ని ఫాలో అవ్వాలి : సీఎం

SMTV Desk 2018-12-08 13:08:28  Chandrababu, Murali mohan

అమరావతి, డిసెంబర్ 8: అమరావతి లోని ముఖ్యమంత్రి నివాసం వద్ద క్యాన్సర్‌ అంబులెన్స్‌ను సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభించారు. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ పార్లమెంటరీ నియోజకవర్గం నిధుల నుంచి రూ.1.75 కోట్లతో దీన్ని సమకూర్చారు. ఈ సందర్భంగా ఎంపీ మురళీమోహన్‌ను చంద్రబాబు అభినందించారు. మురళీమోహన్ ఓ మంచి ఆలోచన చేశారు, ఆయన బాటలో మిగిలిన ఎంపీలందరూ ముందుకు రావాలని చంద్రబాబు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఈ వాహనాలు అందుబాటులో తెస్తే రాష్ట్రంలో క్యాన్సర్‌ను పూర్తిగా నిర్ములించవచ్చు అని సీఎం అభిప్రాయపడ్డారు.

ఈ అంబులెన్స్ సర్వీస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు క్యాన్సర్ ముందస్తు పరీక్షలు పూర్తిగా అందిస్తాం అని మురళీమోహన్ తెలిపారు. గ్రామాల్లో క్యాన్సర్ చికిత్స లను అందుబాటులో తెచ్చేందుకు ఈ వాహనం రూపొందించామన్నారు.