వాయిదా పడ్డ ఎన్టీఆర్ మహానాయకుడు.!

SMTV Desk 2018-12-08 12:35:38  NTR, Balakrishna, Krish

హైదరాబాద్, డిసెంబర్ 8: సీ.ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న కథానాయకుడు , మహానాయకుడు చిత్రాలను జనవరిలో రెండు వారాల తేడాలో విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని చిత్ర నిర్మాతలు మార్చుకున్నారని తెలుస్తోంది. జనవరి 9న మొదటి భాగాన్ని, 15 రోజుల తరువాత జనవరి 24న రెండో భాగాన్ని విడుదల చేసేందుకు చిత్ర దర్శకుడు క్రిష్ ప్లాన్ చేసుకున్నారు. తాజా సినీ వర్గాల సమాచారం మేరకు రెండు భాగాల మధ్య మరింత గ్యాప్ ఉంటే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట.

రెండో భాగం విడుదలయ్యే సమయానికి చాలా ప్రాంతాల్లో మొదటి భాగం కూడా ఆడుతూనే ఉంటుందని, దీంతో రెండో భాగానికి థియేటర్ల సమస్య తలెత్తుంది అనే ఆలోచనలో ఉన్న నిర్మాతలు, రెండో భాగాన్ని ఫిబ్రవరికి వాయిదా వేయాలని భావిస్తున్నారు. నాలుగు వారాల గ్యాప్ లో ఫిబ్రవరి తొలివారంలో మహానాయకుడు వస్తుందని తెలుస్తోంది. తొలి భాగంలో ఎన్టీఆర్ సినీ ప్రయాణ విశేషాలను, రెండో భాగంలో రాజకీయ నాయకుడిగా ఆయన జీవిత వైభవాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు.