ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు...!

SMTV Desk 2018-12-08 12:07:33  Chandrababu, Rahul Gandhi

అమరావతి, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 10న ఢిల్లిలో పర్యటించనున్నారు. ఢిల్లి పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో మిత్రపక్షాలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి బీజేపీయేతర రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ముఖ్యమంత్రులు, జాతీయ, ప్రాంతీయ పార్టీల అగ్రనేతలు హాజరవుతారని టీడీపీ వర్గాలు తెలిపారు.

కాంగ్రెస్‌ అగ్రనేతలతో పాటు వివిధ జాతీయ, ప్రాంతీయ నేతలతో చంద్రబాబు చర్చలు జరపనున్నారు. కాగా ఈ భేటీకి బీఎస్పీ అధినేత్రి మాయావతి వస్తారా… రారా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. భేటీకి కాశ్మీర్‌కు చెందిన పీడీపీని ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు సమాచారం.