ఆంధ్రలో పర్యటించనున్న ప్రధాని ..!

SMTV Desk 2018-12-08 11:35:52  Narendra Modi, Andhra Pradesh

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ జనవరి 6న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యటించనున్నారు. వచ్చే సంవత్సరం మే లో జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఈ పర్యటన చేపట్టనున్నారు. పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో బీజేపీ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నారు

ఈ సారి జరిగే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకొనేందుకు నాలుగు నెలల ముందే ప్రచారం నిర్వహించారు. ఆ రోజు ప.గోదావరిలో జరిగే సభతో పాటు పలుచోట్ల జరిగే సభలో ప్రధాని పాల్గొననున్నారు అని సమాచారం.