మొబైల్‌ ఫోన్‌ తీసుకెళ్లొద్దు

SMTV Desk 2018-12-06 17:20:13  Mobile Phones, telanagana Eections

హైదరాబాద్, డిసెంబర్ 06: తెలంగాణలో రేపే పోలింగ్‌ జరగనుంది. ఈసందర్భంగా ఓటర్లుకు ఈసీ పలు కీలక సూచనలు చేసింది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తమ చేరవాణిలను తీసుకురావద్దని ఆదేశించింది. పోలింగ్‌ సిబ్బంది. కూడా ఫోన్‌ తీసుకువెళ్లడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. పోలింగ్‌ కేంద్రంలో విధులు నిర్వహంచే సిబ్బందికి ఫోన్‌ అత్యవసరమైతే ప్రిసైడింగ్‌ అధికారి అనుమతితో ఫోన్‌ తీసుకుకెళ్లాని తెలిపారు. పోలీసులు కూడా ప్రిసైడింగ్‌ అధికారి అనుమతి ఇస్తేనే పోలింగ్‌ కేంద్రంలోని వెళ్లాలని ఈసీ స్పష్టం చేశారు.