పుజారా ఒక్కడే

SMTV Desk 2018-12-06 12:01:36  Pujara, australia, India

అడిలైడ్ , డిసెంబర్ 06: ఆస్ట్రేలియాలో ప్రారంభమైన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ తడబడింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 127 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. భారత జట్టును చతేశ్వర పుజారా ఆదుకున్నాడు. కీలక సమయంలో నిలకడైన ఆట తీరుతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. 153 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో పుజారా అర్థ శతకం నమోదు చేశాడు.వొకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ పుజారా మాత్రం తనదైన మార్కు ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే భారత్‌ స్కోరును 150 పరుగులు దాటించాడు. ఆసీస్‌ బౌలర్ల నుంచి దూసుకొచ్చిన పదునైన బంతులకు ఎదురొడ్డి నిలబడ్డ పుజారా మరొకసారి తన విలువేంటో చూపించాడు. ఇది పుజారా కెరీర్‌లో 20వ టెస్టు హాఫ్‌ సెంచరీ.పుజారాకు జతగా అశ్విన్‌ క్రీజ్‌లో ఉన్నాడు.