అనసూయ స్పెషల్ ఐటం సాంగ్

SMTV Desk 2018-12-05 16:11:33  anasuya,varun tej,

హైదరాబాద్, డిసెంబర్ 05: హాట్ యాంకర్ గా బుల్లితెర మీద సూపర్ ఫాలోయిన్ ఏర్పరచుకున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ పై కూడా తన మెరుపులు మెరిపిస్తుంది. సాయి ధరం తేజ్ విన్నర్ సినిమాలో సూయ సూయ సూయ సూయా అంటూ తన పేరు మీదే స్పెషల్ సాంగ్ తో అలరించిన అనసూయ మరో క్రేజీ ఐటం సాంగ్ లో కనిపిస్తుందట. విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి నటిస్తున్న ఎఫ్-2 సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ ఉందట.

అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ కూడా అదరగొడుతుందని అంటున్నారు. వెంకటేష్ కు తమన్నా, వరుణ్ తేజ్ కు మెహ్రీన్ కౌర్ జంటగా నటిస్తున్న ఈ ఎఫ్-2 సినిమా ఆద్యంతం వినోదబరితంగా ఉంటుందట. 2019 సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.

అనసూయ ఐటం సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా వస్తున్న ఈ ఎఫ్-2 ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాతో పాటుగా అనసూయ మరో రెండు సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తుండటం విశేషం.