తెలంగాణలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయ్ :వి.హనుమంతరావు

SMTV Desk 2018-12-04 20:52:00  V hanumanth rao, VH, kcr, kavitha

హైదరాబాద్, డిసెంబర్ 04: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన కుమారుడు కేటీఆర్, కూతురు కవితలు సింహంగా అభివర్ణిస్తున్నారని... ఆయన నిజంగా సింహమైతే తీసుకెళ్లి జూలో పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు . కేసీఆర్ ను జూలో పెట్టాలని జూ అధికారులకు లేఖ రాస్తానని వ్యంగంగా మాట్లాడారు

ఈ నేపథ్యం లో ఆయన మాట్లాడుతూ , తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని, గతంలోని దొరల పాలనను గుర్తుకు తెస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయని... వొక ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ అయితే, మరో ప్రభుత్వానికి అసదుద్దీన్ వొవైసీ ముఖ్యమంత్రి అని అన్నారు