‘యన్‌టిఆర్‌‌’ నుంచి తొలి పాట రిలీజ్

SMTV Desk 2018-12-04 17:13:29  NTR biopic, Bala Krishna,

హైదరాబాద్, డిసెంబర్ 4: ‘ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా హీరో బాలకృష్ణ ‘యన్‌టిఆర్‌‌ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్నాడు. బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్‌, రానా, సుమంత్‌, సత్యనారాయణల, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘యన్‌టిఆర్‌ సినిమా తొలిభాగం సంక్రాంతికి రిలీజ్‌ కానుంది.


సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం ‘యన్‌టిఆర్‌ సినిమా నుండి తొలి పాటను రిలీజ్ చేశారు. ‘ఘన కీర్తిసాంద్ర విజితాఖిలాంద్ర జనతాసుదీంద్ర మణిదీపకా… తో పాట ప్రారంభమయింది. బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్‌ ఈ గీతాన్ని అద్భుతంగా ఆలపించారు. రచయితలు శివ శక్తిదత్తా, కే రామకృష్ణలు పాటను రచించారు.