బాబాయికి బాగానే ఇచ్చాడు అబ్బాయికి ఎలా ఇస్తాడో

SMTV Desk 2018-12-03 18:36:13  varun tej,mega hero, tholiprema , harish shankar

హైదరాబాద్, డిసెంబర్ 3 : మెగా హీరో వరుణ తేజ్ తొలిప్రేమ విజయం తో మంచి జోష్ మీద ఉన్నాడు . వరుణ్ తేజ్ "అంతరిక్షం" అనే ప్రయోగాత్మకమయిన సినిమా చేస్తున్నాడు . మొదటి సినిమా " ఘాజి " తోనే ప్రసంశలు పొందిన యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు . కాగా హరీష్ శంకర్ దర్శకత్వం లో వొక సినిమా చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి ఆ సినిమా తమిళ సూపర్ హిట్ " జిగర్ దందా " కి రీమేక్ గా రూపొందుతోంది . తమిళం లో సిద్దార్ద్ , లక్ష్మి మీనన్ జంటగా నటించగా , తెలుగు లో వరుణ్ తేజ్ సరసన చలో బ్యూటీ రష్మిక నటిస్తుంది . రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన " డియర్ కామ్రేడ్ " తో సహా మరొక కన్నడ సినిమా చేస్తుంది . ఈ సినిమా 14రీల్స్ బ్యానేర్ ఈ సినిమాని నిర్మిస్తుంది .

హరీష్ శంకర్ "డిజే " సినిమా పరాభవంతో వొకింత వేగం తగ్గించాడని అనుకోవచ్చు . బాలీవుడ్ సినిమా "దబాంగ్" రీమేక్ తో బాబాయ్ అయిన పవర్ స్టార్ కళ్యాణ్ కి మంచి విజయం అందించాడు , మరి అబ్బాయి వరుణ్ తేజ్ కి ఎలాంటి విజయం అందిస్తాడో చూడాలి .