బొత్సా సంగతి తేలుస్తా : జనసేనాని

SMTV Desk 2018-12-03 12:23:53  pavan kalyan, jagan, botsa

హైదరాబాద్,డిసెంబర్ 3 :జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ కు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే భయం అన్నారు. చంద్రబాబుకి,లోకేష్,జగన్ లకు ప్రధానమంత్రి మోదీ అంటే భయం. నాకు ఎవరి భయం లేదు అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి బిఎస్పి ని నిలబెట్టిన కాన్షిరామే తనకు స్ఫూర్తి అన్నారు. జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు పరిగెత్తుకొస్తాయి అని అన్నారు. చంద్రబాబు, లోకేష్ లా తాను లంచాలు తీసుకోను అన్నారు.

తనపై వైసీపీ నేత బొత్సా అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. బొత్సా నోరు అదుపులో పెట్టుకోవాలి లేకపోతే విజయనగరం వచ్చి అయన సంగతేంటో తేలుస్తా అని మండిపడ్డారు.