ఓవర్సీస్ లో శంకర్- రజినికాంత్ '2.ఓ' పరిస్థితి ఏంటి?

SMTV Desk 2018-12-02 12:03:58  Overseas, US, Rajinikanth, 2.o

హైదరాబాద్, డిసెంబర్ 02: శంకర్, రజినికాంత్ కాంబినేషన్ లో వచ్చిన 2.ఓ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రోబో సీక్వల్ గా వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలు ఏర్పరచగా సినిమా రేంజ్ కు తగినట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తమిళంతో పాటుగా తెలుగు, హింది భాషల్లో కూడా 2.ఓ భారీ బిజినెస్ చేసింది. ఇక్కడ మాత్రమే కాదు ఓవర్సీస్ లో 2.ఓ పెద్ద టార్గెట్ తో రిలీజైంది.

అటు ఇటుగా 7 మిలియన్ డాలర్స్ వస్తే అక్కడ బయ్యర్లు సేఫ్ అయ్యే పరిస్థితి కాని 2.ఓ అక్కడ ఆడియెన్స్ కు రెగ్యులర్ సినిమాగా అనిపించడం ఆశ్చర్యకరం. వీకెండ్ కల్లా 2.5 మిలియన్ డాలర్స్ వసూళు చేయొచ్చని అంటున్నారు. 7 మిలియన్ డాలర్స్ వస్తేనే కాని బయట పడలేని పరిస్థితి అక్కడ బయ్యర్లది. ఈ లెక్కన చూస్తే 2.ఓ కూడా రజిని ఓవర్సీస్ ఫ్యాన్స్ ను నిరాశపరచినట్టే లెక్క.