ఈ పాట మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను : ఏ. ఆర్. రెహమాన్.

SMTV Desk 2018-11-30 18:10:26  ar rehman, sarvam thalamayam,gv prakash,rakendhu mauli,hari haran

హైదరాబాద్, నవంబర్ 30: సింగర్ , యాక్టర్ అయిన జీవీ ప్రకాష్‌ కుమార్ కథానాయకుడిగా రాజీవ్ మీనన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం "సర్వం తాళమయం".

ఈ సినిమా టైటిల్ ట్రాక్ ని కొద్దీ సేపటి క్రితం సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత " ఏ. ఆర్. రెహమాన్ " తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు . రాకేందు మౌళి లిరిక్స్ అందించగా , గాత్రం హరిహరన్ "మొదలయ్యే హృదయం సవ్వడి గర్భాన తొలిగా" అంటూ ఈ పాట సాగుతోంది . మైండ్‌స్క్రీన్ సినిమాస్ పతాకంపై నిర్మించబడిన ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదల చేయగా ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందుతుంది . సంగీతం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందించడం ఈ చిత్ర ఆడియో పై అంచనాలు పెంచుతుంది .