50000 మంది రైతుల భారీ నిరసన

SMTV Desk 2018-11-30 13:46:57  #FarmersMarch,kisan mukthi march,kisan,farmer

న్యూ ఢిల్లీ నవంబర్ 30: మాకు రామ మందిరం వద్దూ ..పంటకి మద్దతు ధరలు కావలి , రైతు రుణమాఫీ కావలి " మోడీ " అంటూ పదంకలిపి , పాదం కదిపి పయనమయిన రైతులు .
వివరాల లో కి వెళితే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా 24 రాష్ట్రాల నుండి, 207 రైతు సంఘాలూ , పలు రాజకీయ పార్టీలూ "ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ " పతాకంపై ఆశిష్ మిట్టల్ నేతృత్వంలో సుమారు 50,000 మంది మద్దతుదారులతో పార్లమెంట్ స్ట్రీట్ కి శుక్రవారం "కిసాన్ ముక్తి మార్చ్" గా పయనమయ్యారు .

కేంద్ర ప్రభుత్వం నుండి తగిన పరిహారం పొందడంలో విఫలమై ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబసభ్యులు పెద్ద స్థాయి లో నిరసనలో పాల్గొంటున్నారు .
ముందుగా నిన్నటి సాయంత్రం రాంలీలా మైదానంలో సమావేశమై విధివిధానాలు చర్చించి ఈ రోజు యాత్ర గా బయలుదేరారు .


సుమారు 3,500 మంది పోలీసు బలగాలు వారిని అదుపు చేస్తున్నారు.
"కిసాన్ ముక్తి మార్చ్" ఈ ఏడాది రైతుల నాలుగవ అతిపెద్ద నిరసన ఇది .
లెఫ్ట్ పార్టీలు , ఆమ్ ఆద్మీ పార్టీ ముందు నుండి తమ మద్దతు తెలుప గా తాజా గా " రాహుల్ గాంధీ " నేను అక్కడికి వచ్చి కలుస్తానని " ట్వీట్ చేసి తన మద్దతు తెలిపారు . పాలక పక్షం నుండి నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడం శోచనీయం.