39 ఏళ్ళ సినిమా కెరియర్ కానీ వయసు 43 ఏళ్ళు

SMTV Desk 2018-11-30 12:51:32  mahesh babu,prince,maharshi,okkadu,dukudu,superstar,one

హైదరాబాద్, నవంబర్ 30: సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్, కొద్దికాలంలోనే తనదైన నటన తో ,స్టైల్‌తో యూత్ ఫేవరెట్ హీరోగా మారి అందరిని మెప్పించి సూపర్ స్టార్ అయ్యాడు . ఇప్పుడున్న తెలుగు హీరోలలో సింపుల్ స్మైల్‌తో అమ్మాయిల మనసు దోచేసే అందగాడు. మహేష్ బాబు వయస్సు 43 సంవత్సరాలంటే నమ్మశక్యం కానీ విషయం . బాలీవుడ్ లో దక్షిణాది హీరోల్లో గుర్తింపున్న హీరో మహేష్ బాబు . దర్శకుడిని పూర్తిగా నమ్మి సినిమాలు చేసే హీరోల్లో మహేష్ బాబు వొకడు .

దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ప్రయోగాత్మక చిత్రంగా రూపొందిన ‘నీడ చిత్రంతో తన తొలడుగేసి దాదాపుగా 39 ఏళ్ళు పూర్తయ్యింది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ '#39YearsForTriumphSSMBInTFI' హాష్ టాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు .

1979 లో విడుదలయిన ‘నీడ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన మహేష్... చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు నటించాడు .
రాజకుమారుడు సినిమాతో రాణించి ,మురారితో మెప్పించి విమర్శకుల ప్రశంసలు పొందాడు ." 1 నేనొక్కడినే " సినిమాతో తనలో దాగున్న కొత్త కోణాన్ని చూపించాడు సినిమా పరాజయం పొందినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది .