96 తెలుగు లో రాబోతుంది

SMTV Desk 2018-11-29 19:12:16  96,TAMIL,ALLUARJUN,NANI,DJ,DIL RAJU,LOVE

హైదరాబాద్, నవంబర్ 30: ఇటీవలి కాలంలో తమిళ చిత్ర పరిశ్రమను కదిలించిన సూపర్ హిట్ లవ్ డ్రామా "96". తమిళంలో ఈ సినిమాని సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి ,త్రిషా జంటగా నటించారు . కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ తెలుగు టాప్ నిర్మాత దిల్ రాజు మద్దతుతో తెలుగులో రీమేక్ చేయబోతున్నారని సమాచారం .

హీరోలు అల్లు అర్జున్, నాని ఈ సినిమా నచ్చి తెలుగులో చేయడానికి పోటీపడుతున్నారు .కానీ నిర్మాత దిల్ రాజు స్క్రిప్ట్ ను డైరెక్టర్ నుండి ముందే కొనేసాడు . ఈ చిత్ర దర్శకుడు పెద్దల సలహా ప్రకారం నాని వైపు చూస్తున్నాడని వార్త.

నటీనటుల నైపుణ్యాల పరంగా బన్నీ నానీ పోటీ పడవచ్చు, కానీ వారి ముందున్న స్టార్ స్టేటస్ ప్రభావం భారీగా ఉంటుంది. అందువల్ల సేతుపతి పాత్రను పునర్నిర్మించడానికి నానిని ఆలోచించి ఉండవచ్చు.

ప్రస్తుతం, నిర్మాత దిల్ రాజు మహేష్ బాబు " మహర్షి " నిర్మాణం లో భాగంగా అమెరికా పర్యాటనలో ఉన్నారు . స్వదేశం తిరిగొచ్చాక ఈ ప్రాజెక్టు పూర్తి వివరాలు తెలియజేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

చూద్దాం ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఎవరు సొంతం చేసుకుంటారో ?