రోబొ 2.O ధాటికి పక్కకు జరిగిన మహేష్ రికార్డు

SMTV Desk 2018-11-28 13:51:55  ROBO2.O,SHANKAR,MAHESHBABU,BUSINESS MAN,HYDERABAD

సంచనల డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన సినిమా "రోబో 2.ఓ". ఈ అద్భుతం రేపు ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది . వొక వైపు రజినీ అభిమానులూ , మరోవైపు అక్షయ్ కుమార్ అభిమానులే కాక అశేష సినిమా ప్రేక్షక లోకం రేపు విడుదలయ్యే ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు . ఈ సినిమాను తమిళ .. తెలుగు .. హిందీ భాషలలో పది వేల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.

మన భాగ్యనగరం హైదరాబాద్ విషయానికొస్తే ప్రసాద్ ఐ మాక్స్ లో తొలి రోజున 35 షోలు ప్రదర్శించనున్నారు, ఇంతవరకూ ఇక్కడ తొలి రోజు 33 షోలు వేసిన సినిమా బిజినెస్ మేన్ దానికి కారణం అప్పటి ప్రిన్స్ అండ్ పూరి క్రేజీ కాంబినేషన్ . గత 7 సంవత్సరాలుగా మహేశ్ బాబు పేరు మీద నిలకడగా వున్న ఆ రికార్డును " రోబో 2.O " అధిగమించడానికి సిద్ధంగా ఉంది . 600 కోట్లతో నిర్మించిన సినిమా ఇంకెన్ని రికార్డ్స్ సాధిస్తుందో .... ?