ప్రణబ్ చివరి ప్రసంగం

SMTV Desk 2017-07-25 11:24:59  pranab mukerjee, meeting, rashtrapathi bhavan, kovind, modi,

న్యూఢిల్లీ, జూలై 25 : భారత దేశ ప్రథమ పౌరుడిగా పని చేసిన 5 ఏళ్ల పాటు రాష్ట్రపతి భవన్ లో మానవీయ విలువలు పాటించడం, ఆనందకర వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నించినట్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన చివరి ప్రసంగంలో తెలిపారు. సోమవారంతో పదవి కాలం పూర్తి చేసుకున్న ప్రణబ్ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా పేదరిక నిర్మూలన కోసం మరింత కృషి జరగాలని సమాజ మార్పులో విద్యా అత్యంత కీలకమైనదని ఆయన అన్నారు. సానుకూల చర్యలతోనే ఆనందం ముడి పడి ఉంటుందని తెలుసుకున్నట్లు తెలిపిన ప్రణబ్ నవ్వుతూ మాట్లాడటం ప్రకృతి తో మమేకం కావడం అంటే సానుకూల దృక్పథం తో చక్కని ఫలితాలు లభిస్తుందని వాటిని ఆయన నేర్చుకున్నట్లు వెల్లడించారు. ఇక పై సాధారణ పౌరుడిగా జీవించనున్న ప్రణబ్ భారత్ కు ఉజ్వల భవిష్యత్తు ఉందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.