మురగదాస్ కి తలనొప్పిగా మారిన సర్కార్

SMTV Desk 2018-11-28 12:44:10  murgados,sarkaar,tamil,vijay

చెన్నై, నవంబర్ 28: ఇటీవల విడుదలై 250 కోట్లకి పైగా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టిన సినిమా సర్కార్ . డైరెక్టర్ మురుగదాస్ ,హీరో విజయ్ ల కంబినేషన్ లో వచ్చిన మరొక సంచలన విజయం . విజయం సంగతి అటుంచితే ఈ సినిమా ఇంకా వివాదాల చుటూనే తిరుగుతోంది . అస్సలు విషయం ఏంటంటే కొన్ని సన్నివేశాల్లో ప్రభుత్వ పథకాలను కించపరుస్తూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రతిష్ఠకు భంగపరిచే లా ఉన్నాయని కొంతమంది ప్రముఖులు తమ అభిప్రాయం వ్యక్త పరిచారు . అందుకే మురుగదాస్ కొన్ని సన్నివేశాలు తొలగించారు . అంతటితో విషయం సర్దుమణగలేదు , మురుగదాస్ బహిరంగ క్షమాపణ చెప్పవలసిందేననీ,ఇక పై ప్రభుత్వ విధానాలను కించపరుస్తూ సినిమాలు తియ్యబోనని హామీ పత్రం రాసి మరీ ఇవ్వాలని పట్టుబట్టారట . ఈ విషయం పై స్పందిచిన మురుగదాస్ లాయర్ , చర్చించిన తరువాత తరువాత వొక నిర్ణయానికి వస్తామని తెలిపారు.