ఎన్నికల ప్రచారం లో ప్రముఖ నటుడు

SMTV Desk 2018-11-27 18:57:22  Venu , Tollywood Hero Venu , TDP, Khammam, Elections

హైదరాబాద్, నవంబర్ 27: బ్లాక్ బస్టర్ మూవీ ‘స్వయంవరం ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయమైన నటుడు వేణు తొట్టెంపూడి. ఆ సినిమా తర్వాత అనేక సినిమాల్లో నటించిన వేణు కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.

ఇంతకాలం సినిమాలకు, సినీ ప్రజలకు దూరంగా ఉన్న వేణు… సడెన్‌గా ఖమ్మం జిల్లాలో సైకిల్‌పై కనిపించాడు. డిసెంబర్ 7 వ తేదీన తెలంగాణలో జరుగనున్న ఎన్నికల్లో ప్రజకూటమి తరపున ప్రచారం చేస్తూ కనిపించాడు.వేణు ప్రచారం ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. వేణు ఖమ్మం ప్రజకూటమి అభ్యర్థి నామా నాగేశ్వర రావు తరపున ప్రచారం చేస్తున్నారు.